​రిబ్బన్ కట్ చేసి, తొలి కొనుగోలు (బోణీ) చేసి అమ్మకాలను ప్రారంభించిన తుడా ఛైర్మన్ డా. సి. డాలర్స్ దివాకర్ రెడ్డి

​జ్యోతి ప్రజ్వలన చేసి శుభాకాంక్షలు తెలిపిన టీటీడీ బోర్డు సభ్యులు జి. భాను ప్రకాష్ రెడ్డి మరియు ప్రముఖ విద్యావేత్తలు

​ఆధ్యాత్మిక నగరంలో సంప్రదాయ వస్త్రాలకు ఇది సరికొత్త చిరునామా: తుడా ఛైర్మన్

భారతీయ సంస్కృతి, సంప్రదాయ దుస్తులకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ వస్త్ర సంస్థ ‘రామరాజ్ కాటన్’ తమ నూతన షోరూంను తిరుపతి నగరంలో శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభించింది.తిరుపతి మున్సిపల్ ఆఫీసు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ వస్త్ర ప్రపంచానికి తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఇతర విశిష్ట అతిథులతో కలిసి ఆయన రిబ్బన్ కట్ చేసి షోరూంను లాంఛనంగా ప్రారంభించారు.

తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి తో పాటు గౌరవ అతిథులు తితిదే బోర్డు సభ్యులు జి. భాను ప్రకాష్ రెడ్డి , రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.ఎస్.ఆర్. కృష్ణమూర్తి , మరియు స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్-ఛాన్సలర్ (ప్రొఫెసర్ జి. జగదీష్ సంయుక్తంగా జ్యోతి ప్రజ్వలన చేశారు.

ప్రారంభోత్సవం అనంతరం షోరూంలోని వివిధ వస్త్ర శ్రేణులను అతిథులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి స్వయంగా నూతన వస్త్రాలను కొనుగోలు చేసి, మొదటి ‘బోణీ’తో షోరూం అమ్మకాలను ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. “భారతీయ సంస్కృతి, కట్టు-బొట్టుకు అద్దం పట్టేలా అత్యంత నాణ్యమైన కాటన్ వస్త్రాలను అందిస్తున్న రామరాజ్ కాటన్ సంస్థ తిరుపతిలో తమ నూతన షోరూంను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరం” అని అన్నారు.

నిత్యం వేలాది మంది భక్తులు తరలివచ్చే ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో సంప్రదాయ పంచెలు, ధోతీలు, కాటన్ షర్టులు, కుర్తాలు మరియు చిన్నారుల దుస్తులు ఒకే వేదికపై అందుబాటులోకి రావడం నగర ప్రజలకు, శ్రీవారి భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రామరాజ్ కాటన్ ప్రతినిధులు, షోరూం నిర్వాహకులు, సిబ్బంది, స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు మరియు పుర ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *