filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 0; hdrForward: 0; shaking: 0.000000; highlight: 0; algolist: 0; multi-frame: 1; brp_mask: 8; brp_del_th: 0.0000,0.0000; brp_del_sen: 0.1000,0.0000; delta:1; bokeh:1; ispap:1; papproctime: 2026:10:14 15:45:46; module: photo;hw-remosaic: false;touch: (0.2258337, 0.48794895);sceneMode: 3145728;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 273.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 35;

నిజాంసాగర్‌, (మన ధ్యాస): నిజాంసాగర్‌ మండలంలోని గోర్గల్‌ గేట్‌ వద్ద ఉన్న సొసైటీ ఫంక్షన్‌ హాల్‌లో అచ్చంపేట్, మల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) నూతన చైర్మన్ లు, పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రజా పండరి పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ విలేకరులకు వెల్లడించారు.అచ్చంపేట సొసైటీ చైర్మన్‌గా జనార్దన్‌రెడ్డి, మల్లూరు సొసైటీ చైర్మన్‌గా భుజంగారి వినోద్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్‌ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.జుక్కల్‌ నియోజకవర్గంలో సొసైటీ చైర్మన్లు, పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, రైతులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజా పండారి కోరారు.సహకార సంఘాలు రైతులకు అండగా నిలుస్తూ, వారి అవసరాలకు అనుగుణంగా సేవలందించాలని, నూతన పాలకవర్గాలు రైతుల సంక్షేమం కోసం కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు బాల సాయిలు,తదితరులు ఉన్నారు

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *