​రేణిగుంట:
తిరుపతి జిల్లా రేణిగుంట మండల కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ₹6 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వేంకట సుధీర్ రెడ్డి భూమి పూజ చేశారు .
​ఈ సందర్భంగా పట్టణంలోని పలు కీలక ప్రాంతాల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రత్యేక భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించారు.​కార్మరియమ్మ గుడి వద్ద సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ.
​బషీర్ తోట నుండి తిమ్మాయిగుంట వెళ్లే రహదారి అభివృద్ధి పనులకు భూమిపూజ.
​ఒడ్డుమిట్ట స్మశాన వాటిక సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ.
​
​ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ… రేణిగుంట పట్టణం మరియు మండలంలో డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో త్వరలోనే ₹30 కోట్ల నిధులు విడుదల కానున్నాయని వెల్లడించారు. ఈ నిధులతో రేణిగుంట వ్యాప్తంగా సమగ్ర డ్రైనేజీ వ్యవస్థను, అంతర్గత రహదారులను వేగవంతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

​ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్థానిక నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నాయకులు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *