​నిన్న వర్చువల్‌ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

​క్షేత్రస్థాయిలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన తుడా చైర్మన్, వైస్ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే మరియు కూటమి నాయకులు

​స్థానిక ప్రజల దశాబ్దాల కల సాకారం: అభివృద్ధి పనుల్లో వేగం పెంచుతాం

__ తుడా ఛైర్మన్ డా డాలర్స్ దివాకర్ రెడ్డి.

శెట్టిపల్లి పరిధిలోని ఎరుకల బాట ప్రాంత వాసుల చిరకాల స్వప్నం సాకారమైంది.శెట్టిపల్లి ప్రజల రాకపోకలను సులభతరం చేస్తూ, ప్రాంతీయ అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు ప్రతిపాదించిన నూతన రహదారి నిర్మాణ పనులకు సంబంధించి క్షేత్రస్థాయిలో భూమిపూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రహదారి పనులను వర్చువల్ విధానంలో అధికారికంగా ప్రారంభించగా, దానికి కొనసాగింపుగా నేడు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా శంకుస్థాపన శిలాఫలకం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు.ఈ భూమిపూజ కార్యక్రమంలో తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి , తుడా వైస్ చైర్మన్ ఆర్. గోవిందరావు , తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు ,పార్లమెంట్ అధ్యక్షులు పనబాక లక్ష్మి తదితరులు పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించి,శిలాఫలకం వద్ద పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు,తిరుపతి ఇంచార్జి జేబీ శ్రీనివాస్ ,వివిధ కార్పొరేషన్ చైర్మన్లు,కూటమి ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు,తుడా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *