స్థానిక పరిశుద్ధ యోహాను దేవాలయం నందు నూతనంగా చేపట్టనున్న దేవాలయ నిర్మాణ పనుల కొరకు కీర్తిశేషులు బత్తల జయరాజు, కీర్తిశేషులు ఏ ఎస్ పి సారా సుశీలమ్మల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రూ. 3,00,000/- (మూడు లక్షల రూపాయలు) విరాళంగా అందజేశారు.
వారి కుమారులు బత్తల ప్రతాప్ రాజ్ కుమార్, బత్తల ప్రదీప్ రాజ్ కుమార్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ విరాళాన్ని దేవాలయ పాస్టర్ రెవరెండ్ ఇమ్మాన్యుయేల్ బాబు సమక్షంలో నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా పాస్టర్ రెవరెండ్ ఇమ్మాన్యుయేల్ బాబు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, దేవుని మందిర నిర్మాణానికి ఉదారంగా సహకరించిన బత్తల కుటుంబ సభ్యులను అభినందిస్తూ దైవాశీస్సులు అందజేశారు. దైవ కార్యాల కోసం ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించడం ఎంతో అభినందనీయమని కమిటీ ప్రతినిధులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, దేవాలయ కమిటీ ప్రతినిధులు, సంఘ విశ్వాసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *