- కిడ్జీ ప్రీ-స్కూల్ నూతన శాఖను ఘనంగా ప్రారంభించిన తుడా చైర్మన్
- ఆటపాటలతో కూడిన విద్యాబోధనతోనే చిన్నారుల్లో సృజనాత్మకత పెంపొందుతుందని వెల్లడి
- పాల్గొన్న తిరుపతి రూరల్ మండల తెదేపా అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, పుదిపట్ల మాజీ సర్పంచ్ బడి సుధ యాదవ్
చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు మరియు వారి సమగ్ర వికాసానికి ప్రాథమిక స్థాయిలోనే అందించే నాణ్యమైన విద్యా పునాది అత్యంత కీలకమని తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు.
తిరుపతి రూరల్ మండలం పూడిపట్ల లో ప్రీ-స్కూల్ విద్యా సంస్థ ‘కిడ్జీ’ నూతన కేంద్రాన్ని తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.
ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ప్రీ-స్కూల్ విద్య అందుబాటులోకి రావడం హర్షణీయమన్నారు.
చిన్నారులకు ఇంట్లో ఉన్నటువంటి ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు నైతిక విలువలను కూడా నేర్పించాలని సూచించారు.
అనంతరం పాఠశాల నిర్వాహకులు తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ని శాలువాతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.

