
పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు
ఐరాల ఆగస్ట్ 11 మన ద్యాస(నాగరాజ సరకింటి)
జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పూతలపట్టు నియోజకవర్గ స్థానిక ఎన్నికల అసెంబ్లీ సమన్వయకర్త ఎం. మహేష్ స్వేరో తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు అభ్యర్థుల ఎంపిక, కూటమి పార్టీల మధ్య సమన్వయం, 100 శాతం విజయాలే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ సమన్వయ కమిటీలను ప్రకటించిన నేపథ్యంలో చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ అసెంబ్లీ సమన్వయకర్తగా తనను నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మహేష్ స్వేరో మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కమిటీల సభ్యులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పూతలపట్టు నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాషులతో పాటు తెలుగుదేశం, బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేసే ప్రతి స్థానంలో వారికి అండగా నిలిచి, విజయమే లక్ష్యంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వివిధ శాఖల ద్వారా గ్రామస్థాయిలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ జనసేన, కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని మహేష్ స్వేరో వెల్లడించారు.