బంగారుపాళ్యం, అక్టోబర్ 9 మన ద్యాస (నాగరాజ సరకింటి )
బంగారుపాళ్యం మండలం బంగారు పాళ్యం- అరగొండ రహదారిపై తుంబకు ప్పం క్రాస్ సమీపంలోని దొడ్లడైరీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తవణం పల్లి మండలం మల్లకుంట గ్రామానికి చెందిన ఎస్. రవి మృతి చెందారు.మృతుడు తన స్పెండర్ మోటార్ సైకిల్ నంబరు AP-03-BN-6672 పై బంగారు పాళ్యం నుండి తవణంపల్లి వైపు వెళుతుండ గా, అరగొండ వైపు నుండి వస్తున్న బొలెరో పికప్ వాహనం నంబరు 21 -1507 డ్రైవర్ మల్లికార్జున వాహనాన్ని అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి మోటార్సైకిల్ను ఎదురుగా ఢీకొట్టినట్లు ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో రవికి తలపై తీవ్రగా యం, ఎడమ మోకాలికి గాయం కావడం తో సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం అందు కున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలా నికి చేరుకుని, మృతదేహాన్ని బంగారు పాళ్యం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి భార్య ఎస్. అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంగారుపాళ్యం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగినదని ఎస్సై ప్రసాద్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *