* సమాచార కమిషనర్లను కలిసిన ఆర్టిఐ కార్యకర్తల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముత్తు, రాష్ట్ర అధ్యక్షులు నరేష్ పాటుకూరి
విజయవాడ(చిత్తూరు )సెప్టెంబర్ 08 మన ద్యాస
సమాజంలో ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు వెల్లడించారు. గురువారం మంగళగిరిలోని సమాచార హక్కు చట్టం కార్యాలయంలో రాష్ట్ర సమాచార హక్కు కార్యకర్తల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముత్తు, రాష్ట్ర అధ్యక్షులు పాటుకూరి నరేష్(చిత్తూరు)సమాచారకమిషనర్లనుమర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 12వ తేదీన ఆర్టిఐ డే పురస్కరించుకొని ప్రత్యేక కరదీపికనుఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ప్రతి పౌరుడు, కళాశాలలో యువతకు ఈ చట్టంపై అవగాహనకల్పించాలన్నారు. ప్రతి అధికారి దరఖాస్తుదారునికి గడువులోపు సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. పౌరులకు సమాచార హక్కు చట్టాన్ని కల్పించడం రాజ్యాంగం మనకు కల్పించిన ప్రధాన హక్కుల లో ఒకటిని తెలిపారు. ఆర్గనైజేషన్ సభ్యులను వారు చేస్తున్న కార్యక్రమాలను సమాచార కమిషనర్లు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *