​రేణిగుంట మండలం, తుకివాకం పంచాయతీ పరిధిలోని ఏఎన్ఆర్ కాలనీ సమీపంలో ఉన్న సాయి సదన్ వెంచర్‌లో ఒక యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న తీవ్ర విషాద సంఘటన వెలుగు చూసింది. గాజులమండ్యం సీఐ మంజునాథ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, కుషినాగర్ జిల్లా, బోదర్వార్ తాలూకా, పీపర గ్రామానికి చెందిన విష్ణు దయాళ్ సింగ్ కుమారుడు రాజ్ (20) సాయి సదన్ వెంచర్‌లోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు విడిచాడు. అక్టోబర్ 8వ తేది గురువారం ఉదయం సుమారు 8:00 గంటల సమయంలో రాజ్ మొబైల్ ఫోన్ నుంచి ఓ గుర్తుతెలియని వ్యక్తి సమాచారం అందించడంతో ఫిర్యాదుదారు, శ్యామ్ సింగ్‌తో కలసి వెంటనే చెన్నై నుంచి బయలుదేరి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం రాజ్ మరణ వార్తను అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ ఘోర ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు గాజులమండ్యం పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆత్మహత్యకు గల పూర్తి కారణాలను తెలుసుకునేందుకు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *