​బీసీల విషయంలో అధికార, ప్రతిపక్షాలది దొంగ నాటకం..
హక్కుల పోరాట సమితి జాతీయ కార్యదర్శి పూల వెంకటాద్రి యాదవ్..

​రేణిగుంట (ఆక్టోబర్ 08):
బీసీలకు రావాల్సిన న్యాయమైన రిజర్వేషన్లు సాధించేవరకు బీసీ నాయకులు మరియు వర్గాలు అంతా ఐక్యంగా పోరాడాలని బీసీ హక్కుల పోరాట సమితి జాతీయ కార్యదర్శి పూల వెంకటాద్రి యాదవ్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆయన పలువురు పార్టీ నాయకులు, బీసీ ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిశారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అధికార పక్షం మరియు ప్రతిపక్ష పార్టీలు రెండూ బీసీ రిజర్వేషన్ల విషయంలో దొంగ నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్న ఆ రెండు పార్టీలకు రాబోయే ఎన్నికల్లో బీసీలంతా కలిసి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. బీసీ పోరాడాలిబీసీ హక్కుల రక్షణ మరియు రిజర్వేషన్ సాధనకై ఉమ్మడిగా బీసీ సంఘాలు, నాయకులు ఐక్యపోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు.
​ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘాల నాయకులు, హక్కుల పోరాట సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *