*విజయవాడ రూరల్, అక్టోబర్ 6 (మన న్యూస్)

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలంలో SSF నిర్మించిన మొదటి దేవాలయం శ్రీ సమరసత గంగానమ్మ దేవాలయం కేంద్రంగా జరుగుతున్న బాలవికాస్ పాఠశాలను సోమవారం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ సందర్శించారు.ముందుగా ఆలయ అర్చకులు గురవయ్య వేద మంత్రాలతో కమిషనర్‌కు స్వాగతం పలికి అమ్మవారికి ప్రత్యేక అర్చన చేశారు. అనంతరం ఆంధ్రా ప్రాంత SSF అధ్యక్షులు శ్రీ తాళ్లూరి విష్ణువు బాలవికాస్ పనితీరును వివరించారు. గ్రామాల్లో పిల్లలకు బాలవికాస్ పాఠశాల ద్వారా సంస్కృతి, సంప్రదాయాలు, తల్లిదండ్రులను గౌరవించడం, ఆటపాటలు, దేశభక్తి, దైవభక్తి, మంచి అలవాట్లను నేర్పిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం పేద పిల్లలు గుడిలో ఉండి అభ్యసించడం వల్ల వారిలో మంచి పరివర్తన వస్తోందని చెప్పారు.అనంతరం మాతాజీ ప్రతిరోజూ పాఠశాలల్లో చేసే పని విధానాన్ని వివరించారు. చిన్నారులు తాము నేర్చుకున్న శ్లోకాలు, పద్యాలు, దేశభక్తి గీతాలను ప్రదర్శించారు. తల్లిదండ్రులు కూడా బాలవికాస్ ఏర్పాటు తర్వాత తమ పిల్లల్లో వచ్చిన సానుకూల మార్పును తెలియజేశారు.ఈ సందర్భంగా కమిషనర్ రామచంద్ర మోహన్ మాట్లాడుతూ చిన్నారులు చెప్పిన శ్లోకాలు, పద్యాలు విని ఎంతో సంతోషించానని, హిందూ ధర్మ ప్రచారం కోసం సమరసత సేవా ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. SSF స్ఫూర్తితో రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఇలాంటి బాలవికాస్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ ఫణి కుమార్ అధ్యక్షత వహించగా, బాలవికాస్ సహ కన్వీనర్లు శ్రీ హరి చరణ్, భూపతిరాజు సత్యన్నారాయణ రాజు, దేవాలయ సెక్రటరీ శ్రీమతి విజయలక్ష్మి, లక్ష్మణ్, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమ ఏర్పాట్లను ఆలయ అధ్యక్షులు  బండి అనిల్ కుమార్ చక్కగా నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *