కృష్ణారెడ్డిపాలెంలో విలేజ్ హెల్త్ క్లినిక్ – ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.
కలిగిరి, అక్టోబర్ 6, మన న్యూస్ RC ఇన్చార్జి ప్రతినిధి నాగరాజు.

గ్రామీణ ప్రాంతాల్లోని పేద, సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్నారు.కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలెం గ్రామ పంచాయతీలో 36 లక్షల ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్, ఎన్.హెచ్.ఎం నిధులతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ – ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు, AMC చైర్మన్ విజయలక్ష్మిగారితో కలసి ప్రారంభించారు. అనంతరం నూతన ఆరోగ్య కేంద్రంలోని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక వైద్యం సులభంగా అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యల కోసం పేదలు, సామాన్య ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామస్థాయిలోనే వైద్య సేవలు అందించేందుకు విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఎంతో కీలకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.కృష్ణారెడ్డిపాలెం గ్రామంలో అందుబాటులోకి వచ్చిన ఈ ఆరోగ్య కేంద్రం ద్వారా గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షలు, అవసరమైన మందుల పంపిణీ, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులకు అవసరమైన ఆరోగ్య సేవలు మరింత సులభంగా లభిస్తాయని అన్నారు.ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది అని పేర్కొన్న ఎమ్మెల్యే.. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాల ఫలాలు ప్రతి గ్రామంలోని ప్రతి కుటుంబానికి అందేలా అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.అలాగే ప్రజలు నూతన ఆరోగ్య కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని వైద్య సిబ్బందిని సంప్రదించాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు కోరారు.రూ.6 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన,,,అనంతరం కృష్ణారెడ్డిపాలెం బీసీ కాలనీలో రూ.6 లక్షల వి.బి.జి. రాంజీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శంకుస్థాపన చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా మెరుగుపరుస్తూ, ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
