శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ ,నిత్యావసర సరుకుల పంపిణీ..

శ్రీకాళహస్తి: పట్టణంలో కాంగ్రెస్ పార్టీ దివంగత మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నాయకులు గురుదాస్ కామత్ జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ షేక్ కరీముల్లా ఆధ్వర్యంలో, తిరుపతి జిల్లా క్రిస్టియన్ మైనారిటీ నాయకులు కె.సి. ప్రేమసుందరం అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా గురుదాస్ కామత్ జీ చిత్రపటానికి నివాళులర్పించి, కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

కార్యక్రమంలో ఎస్సీ సెల్ నాయకులు ఎన్. బత్తయ్య, పాస్టర్ సోదరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

గురుదాస్ కామత్ జీ సేవలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో సామాజిక సేవా కార్యక్రమంగా నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *