స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ 119వ
జయంతి సందర్బంగా సోమవారం రేణిగుంట లోని ఆషా స్వచ్ఛంద సేవ సంస్థ కార్యాలయంలో భగత్ సింగ్ చిత్రపటానికి ఆషా సంస్థ అధ్యక్షులు జూలియన్ రాజు పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జూలియన్ రాజు మాట్లాడుతూ మరణాన్ని సైతం లెక్కచేయకుండా దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్‌ను ‘షహీద్ భగత్ సింగ్’ (అమరవీరుడు) గా దేశం గుర్తుపెట్టుకున్నది అని అన్నారు. చిన్న వయస్సులోనే దేశభక్తి, దైర్యం, త్యాగం పట్ల ఎంతో స్ఫూర్తిని ప్రదర్శించారని తెలిపారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి యువతలో దేశ భక్తిని రగిలించిన భగత్ సింగ్ ను
1931 మార్చి న లాహోర్ జైల్లో ఉరితీసారని పేర్కొన్నారు. ఆయన త్యాగం, ధైర్యం, భావాలు భారతీయ యువతకు ఎప్పటికీ గొప్ప స్ఫూర్తిదాయకమన్నారు. అలాంటి మహనీయుని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *