వింజమూరు, సెప్టెంబర్ 23, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

వింజమూరు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మండల కన్వీనర్, మాజీ సొసైటీ చైర్మన్ గొంగటి రఘునాథ రెడ్డి మృతి చెందడం పట్ల ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ సంతాపమును వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరులోని గొంగటి రఘునాథ రెడ్డి నివాసానికి చేరుకుని, వారి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, వింజమూరు మండలంలో పార్టీ అభివృద్ధికి గొంగటి రఘునాథ రెడ్డి అందించిన సేవలను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసిన సీనియర్ నాయకుడిగా ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో గొంగటి రఘునాథ రెడ్డి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా “గొంగటి రఘునాథ రెడ్డి గారి మృతి పార్టీకి, వింజమూరు ప్రాంతానికి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *