తిరుమల వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగింపు దశకు చేరుకున్నాయి.శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు వరాహస్వామి ఆలయ సమీపంలోని పుష్కరిణి మెట్లపై విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు.అనంతరం బ్రహ్మోత్సవాల్లో అత్యంత పవిత్రమైన ఘట్టమైన ‘చక్రస్నానం’ మహోత్సవం పుష్కరిణి తీర్థంలో శాస్త్రోక్తంగా, నేత్రపర్వంగా జరిగింది.ఈ పుణ్య కార్యక్రమంలో తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని చక్రత్తాళ్వార్‌కు జరిగిన ప్రత్యేక పూజల్లో పాలుపంచుకుని, పవిత్ర పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరించారు.ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ఆలయ అర్చకులు,భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *