​హైదరాబాద్ కేబీఆర్ పార్క్, వరంగల్ భద్రకాళి చెరువులను తీర్చిదిద్దిన బొంబాయి ప్రముఖ ఆర్కిటెక్ట్ సంవేద్ ప్రధాన్‌తో ప్రత్యేక సమీక్ష

తిరుపతి పరిసర ప్రాంతాల చెరువుల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అవిలాల చెరువు కట్ట సుందరీకరణ, అభివృద్ధి పనులపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.ప్రకృతి రమణీయతకు ఆధునిక హంగులు జోడించి, అవిలాల చెరువును తిరుపతి నగరానికే తలమానికమైన పర్యాటక, ఆహ్లాద కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తుడా ఛైర్మన్ సమక్షంలో ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి.ఇందులో భాగంగా అవిలాల చెరువు కట్ట పటిష్టత, ఆకర్షణీయమైన డిజైన్ల రూపకల్పన కోసం దేశంలోనే విశేష గుర్తింపు పొందిన ముంబైకి చెందిన ప్రముఖ అర్బన్ ఆర్కిటెక్ట్ సంవేద్ ప్రధాన్ తో సుదీర్ఘంగా చర్చించారు.హైదరాబాద్‌ లోని కేబీఆర్ పార్క్, లేక్ ఫ్రంట్, చారిత్రక వరంగల్ భద్రకాళి చెరువు సుందరీకరణ, సిద్ధిపేట జిల్లాలోని పలు ప్రతిష్ఠాత్మక లేక్ ఫ్రంట్ ప్రాజెక్టులను అద్భుతంగా తీర్చిదిద్దిన విశేష అనుభవం గల ఆర్కిటెక్ట్ సంవేద్ ప్రధాన్‌ తో సూత్రప్రాయంగా చర్చలు జరిపారు.సమీక్ష సందర్భంగా డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ… ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి వచ్చే భక్తులు, స్థానిక నగర ప్రజలు ప్రశాంతంగా గడిపేలా అవిలాల చెరువును మోడల్ లేక్ ఫ్రంట్‌గా అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.స్థానిక వాతావరణానికి సరిపడే దేశీయ పూల మొక్కలు, నీడనిచ్చే చెట్లతో ఆకర్షణీయమైన గ్రీన్ బెల్ట్,కట్ట పొడవునా పర్యావరణ అనుకూలమైన వాకింగ్, జాగింగ్ ట్రాక్‌ల తో పాటు యువత కోసం ప్రత్యేక సైక్లింగ్ డిజైన్స్ చేయాలని సూచించారు.చిన్నారుల కోసం అధునాతన ఆట స్థలాలు, నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆధునిక పరికరాలతో కూడిన ఓపెన్ జిమ్ ఏర్పాటు.రాత్రి సమయాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేలా అత్యాధునిక ఎల్ఈడీ లైటింగ్, చెరువు ప్రకృతి అందాలను తిలకించేందుకు అనువుగా ప్రత్యేక వ్యూయింగ్ డెక్స్ ఉండేలా చూడాలని తెలిపారు.క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన అనంతరం ఆర్కిటెక్ట్ సంవేద్ ప్రధాన్ ప్రాథమిక లేఅవుట్లను ఛైర్మన్ కి వివరించారు.ప్రజల అవసరాలు, పర్యావరణ పరిరక్షణను సమన్వయం చేస్తూ త్వరలోనే పూర్తిస్థాయి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను సిద్ధం చేయాలని డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఆదేశించారు.ఈ సమీక్షా సమావేశంలో తుడా సెక్రటరీ డా యన్ వి శ్రీకాంత్ బాబు ఎస్ ఈ రవీంద్రయ్య, జన వనరుల శాఖ ఎస్ ఈ వెంకటేశ్వర ప్రసాద్, రవి కుమార్ తుడా డిఈ నరేష్,ఏ ఈ నితిన్,అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *