మన ధ్యాస ప్రతినిధి గోపాలపట్నం సెప్టెంబర్ 18: శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా యంగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ గణబాబు తనయుడు యువ నాయకుడు మౌర్య సింహ పాల్గొన్నారు.యంగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు మౌర్యసింహా ని వినాయకుని విగ్రహం దగ్గరికి తీసుకుని వెళ్లి ఆయనకు ఘన సన్మానం చేసి తదనంతరం పేదలకు అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.మౌర్య సింహ చేతుల మీదగా అన్న వితరణ చేయడం జరిగింది. తదనంతరం మౌర్యసింహ మీడియాతో మాట్లాడుతూ యంగ్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని వినాయక చవితి సందర్భంగా పూజా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో నిత్యం ఆ గణనాథుని సేవిస్తారని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమం బుద్ధ శివాజీ, ఉత్సవ కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *