పేదలకు అన్నదానం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

చిత్తూరు, మన ధ్యాస , సెప్టెంబర్ 11

రిపోర్టర్ కమల్ రెడ్డి

రాజంపేట పార్లమెంట్ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను చిత్తూరు నగరంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ జ్ఞాన జగదీష్ ఆధ్వర్యంలో స్థానిక సంతపేట కరుమారియమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం ఎదుట భారీ కేక్ కట్ చేయడంతో పాటు పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాలకు వైసీపీ చిత్తూరు నియోజకవర్గ ఇంచార్జి విజయానంద రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి ఎంపీ మిథున్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, ప్రజలకు మరింత సేవ చేసేలా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జ్ఞాన జగదీష్ మాట్లాడుతూ మిథున్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని కొనియాడారు. ఆయనకు కార్యకర్తలు, అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని స్పష్టం చేశారు. అంతకు ముందు చిత్తూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఎంసి విజయానందరెడ్డి భారీ కేక్ కట్ చేశారు. చివరగా చిత్తూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో మాజీ కార్పొరేటర్ హరిణి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( చుడ ) మాజీ చైర్మన్ కట్టమంచి పురుషోత్తమరెడ్డి, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ఆర్ చంద్రశేఖర్, వైసీపీ నాయకులు అపోజి, తిమ్మసముద్రం రవీంద్రారెడ్డి, కట్టమంచి మనోహరరెడ్డి, తాళంబేడు అమర్నాథరెడ్డి, సంతపేట నారాయణ, చిత్తూరు రూరల్ మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు త్యాగరాజులు, పార్టీ ముఖ్య నాయకులు అన్బు, చక్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎంపీ మిథున్ రెడ్డి అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *