వింజమూరు సెప్టెంబర్ 12: మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
యుటిఎఫ్ మరియు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వింజమూరు స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉదయం చెకుముకి మండల స్థాయి టాలెంట్ టెస్ట్ ఘనంగా జరిగింది.ఈ పరీక్షకు మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.పోటీలలో ప్రథమ స్థానాన్ని గుండెమడకల ఉన్నత పాఠశాల, ద్వితీయ స్థానాన్ని బాలుర ఉన్నత పాఠశాల, తృతీయ స్థానాన్ని బాలికల ఉన్నత పాఠశాల కైవసం చేసుకున్నాయి.ప్రథమ స్థానం సాధించిన గుండెమడకల ఉన్నత పాఠశాల జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైంది.అనంతరం గెలుపొందిన విద్యార్థులకు భోజనపు గోపి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు రమేష్, వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు వీర రాఘవులు, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి చెంచల బాబు, జన విజ్ఞాన వేదిక నాయకులు కృష్ణారెడ్డి, కామాక్షయ్య, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
