మన న్యూస్,నిజాంసాగర్, సెప్టెంబర్‌ 4 ,హనుమాన్‌ శోభాయాత్రను సెప్టెంబర్‌ 5న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు అంజనాద్రి క్షేత్రం నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుంది. నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ శివారులోని 161 జాతీయ రహదారి ప్రక్కనగల
అంజనాద్రి క్షేత్రం నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర మాగి, నర్సింగ్‌రావుపల్లి, బొగ్గుగుడిసె, తిమ్మారెడ్డి గ్రామాల మీదుగా కొనసాగి ఎల్లారెడ్డి రామాలయం వరకు చేరుకోనుంది. మార్గమధ్యంలోని గ్రామాల్లో భక్తులు శోభాయాత్రకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.హనుమాన్‌ స్వామి భక్తులు, యువత, మహిళలు, పెద్దలు పెద్ద సంఖ్యలో శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో శోభాయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు.
శోభాయాత్ర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో భక్తులు పాల్గొని హనుమాన్‌ స్వామి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పట్లోళ్ల కిషోర్‌ కుమార్‌ మాట్లాడుతూ.. హనుమాన్‌ శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేయాలని కోరారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *