ఏర్పేడు సెప్టెంబర్ 3. ఏర్పేడు మండలం కందాడ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త జిపాలెం మునిరెడ్డి పార్థివదేహానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు తో పాటు స్థానిక టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు మునిరెడ్డి భౌతికకాయాన్ని దర్శించుకుని శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధికి మునిరెడ్డి చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ వారి కుటుంబసభ్యులకు తన గాఢ సానుభూతిని తెలిపారు. మునిరెడ్డి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఏ అవసరం వచ్చినా ఆదుకుంటామని ఆయన కొండంత భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *