మనధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సింగరాయకొండ మండల మాజీ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు వీర మహిళలు అందరి సహకారంతో సంబరాలు అంబరాన్ని తాకేలా జరిగాయి. సింగరాయకొండ లో గంజి వారి కళ్యాణ మండపం నందు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేశారు పంచాయతీరాజ్ శాఖ మాత్యులు కోణిదెల పవన్ కళ్యాణ్ ఎప్పుడూ పేదప్రజల గురించి వారి అభ్యున్నతి గురించి పంచాయితీ రాజ్ శాఖను ప్రథమ స్థానం లో నిలిపిన వ్యక్తి కనుక పంచాయతీ పారిశుద్ధ మహిళ కార్మికుల ద్వారా కేక్ కట్ చేయించి, ప్రత్యేకంగా అక్క చెల్లెలకు చీరలు పంపిణీ చేయడం, జనసేన పార్టీ వీర మహిళలకు చీరల పంపిణీ చేయడం, అనంతరం భోజన కార్యక్రమం చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ప్రజలు మరియు వీరమహిళలు పవన్ కళ్యాణ్ కి ఆశీర్వాదాలు తో ఆ భగవంతుని సాక్షిగా మనస్పూర్తిగా ప్రార్ధించారు. ఈ కార్యక్రమాన్ని తక్కువ సమయంలో విజయవంతం చేసినటువంటి జనసేన నాయకులు వీర మహిళలకు దివ్యంగుల సోదరులకు జనసేన మండల నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పై జనసేన పార్టీ ఎప్పుడు ముందు ఉంది సమస్యల పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసారు.