దళితవాడ సమస్యలపై ఆగస్టు 24న “చలో కలెక్టరేట్”!!.

రేణిగుంట ఆగష్టు 23.
రేణిగుంట మండలంలో తూకివాకం హరిజనవాడ నుండి 2 వ రోజు “ఆటో ప్రచారం జాత” ను కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్)ఆధ్వర్యంలో ఆదివారం నాడు విస్తృతంగా గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. రేణిగుంట మండలంలో దళితవాడ గ్రామాల సమస్యలపై ఆగస్టు 24న “చలో కలెక్టరేట్” కు అర్జీలు తీసుకొని కదలి రావాలని పిలుపు ఇచ్చారు. దళితుల స్మశానాలు, దారులు, త్రాగునీరు, భూ సమస్యలు వంటి అనేక సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టరేట్ కు అర్జీలతో తరలి రావాలని ఈ ఆటో ప్రచార జాత సందర్భంగా పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల నాయకులు సెల్వరాజు, రాజశేఖర్, హరినాథ్, హేమనాథ్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *