స్వామివారిని దర్శించుకున్న శ్రీమతి బొజ్జల రిషితా రెడ్డి.

​ఏర్పేడు ఆగష్టు 21.

శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పాపా నాయుడు పేటలో శ్రీ ధర్మరాజుల స్వామి వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి శ్రీమతి బొజ్జల రిషితా రెడ్డి ఆలయాన్ని సందర్శించారు.
​ఆలయానికి విచ్చేసిన శ్రీమతి రిషితా రెడ్డికి చేనేత సంఘ సభ్యులు వి. కృష్ణప్ప మొదలి, ఎమ్. రవి కుమార్, తంబా మురుగప్ప, శ్రీను, డిల్లీ కుమార్, సుబ్రమణ్యం మరియు పూజారి రవి తేజ్, మాధవయ్యలు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
​అనంతరం ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. పూజల అనంతరం అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పేరం ధనంజయ నాయుడు, మోహన్ రావు, పేరం నాగరాజు నాయుడు, బత్తాల గిరి నాయుడు, నిరంజన బాబు నాయుడు, సీతాపతి ఆచారి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *