ఆలయ చైర్మన్ బత్తెల గిరి నాయుడు ఆధ్వర్యంలో వైభవంగా ‘సారె’ సమర్పణ…

రేణిగుంట ఆగష్టు 21.

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం తరఫున శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.పాపానాయుడుపేటలో వెలసియున్న శ్రీ ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గుడిమల్లం ఆలయ చైర్మన్ బత్తెల గిరి నాయుడు ఆధ్వర్యంలో స్వామివార్లకు సాంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు, సారెను సమర్పించారు.ఈ సందర్భంగా పాపానాయుడుపేటలోని ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి ఆలయ చైర్మన్, పాలకమండలి సభ్యులు, కార్యనిర్వహణాధికారి (ఈఓ) గుడిమల్లం దేవస్థాన బృందానికి ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో వారికి స్వాగత ఏర్పాట్లు పూర్తి చేసి, భక్తిశ్రద్ధలతో సారెను స్వీకరించారు. రెండు దేవస్థానాల ప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో గుడిమల్లం ఆలయ చైర్మన్ బత్తల గిరి నాయుడుతో పాటు కార్యనిర్వహణాధికారి, పాలకమండలి సభ్యులు రాజ్ కుమార్, ఉషా, బాబు పాల్గొన్నారు. వారితో పాటు గ్రామస్తులు పద్మనాభ నాయుడు, సురేష్ నాయుడు, హేమ సుందరం, రాజా మరియు పెద్ద సంఖ్యలో గ్రామ మహిళలు, భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *