మన ధ్యాస,నిజాంసాగర్:మండల కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు రాజకీయ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించారు.మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ భుజంగారావు, పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ శివకుమార్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శివకృష్ణ, ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ తిరుపతిరెడ్డి, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం ప్రసన్న రాణి, బంజపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచు సుగుణమ్మ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు ప్రజాపండరి అచ్చంపేట సొసైటీ కార్యాలయంలో సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించారు.నిజాంసాగర్ బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పట్లోళ్ల దుర్గారెడ్డి ,ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ రోహిత్ కుమార్ , మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రవీందర్ రెడ్డి, తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ లతా, గున్కుల్ సొసైటీ కార్యాలయంలో చైర్మన్ వాజిద్ అలీ, మహమ్మద్ నగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచు దాఫెదర్ బాలమణి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో అనిత మండల స్పెషల్ ఆఫీసర్ ప్రసాద్ రావుజాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయా కార్యాలయాల వద్ద దేశభక్తి వాతావరణం నెలకొంది. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ఈ సందర్భంగా అధికారులు, నాయకులు స్మరించుకున్నారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమాల్లో అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *