మన ధ్యాస,నిజాంసాగర్,మద్నూర్: మండల కేంద్రంలోని మైధిలి ఫంక్షన్ హాల్‌లో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హన్మంత్ షిండే కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు తినిపిస్తూ సంబరాలు జరుపుకున్నారు.
అనంతరం నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండేను శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోల దుర్గారెడ్డి, మండల అధ్యక్షులు సాదుల సత్యనారాయణ, మాజీ వైస్ ఎంపీపీ మనోహర్, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు రమేష్ గౌడ్, సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ, నరసింహారెడ్డి, మాజీ సర్పంచులు లక్ష్మీనారాయణ, లక్ష్మారెడ్డి, చందర్,నాయకులు పిట్ల సత్యనారాయణ,మనీష్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *