

మన న్యూస్:నెల్లూరు నగర నియోజకవర్గం లో అత్యద్భుతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు.సుమారు 2 వేల మంది కార్యకర్తల మధ్య భారీ కేక్ కటింగ్.బాణసంచా చప్పుళ్ళు జై జగన్, జై వైస్సార్సీపీ నినాదాలతో మారుమోగిన ప్రాంగణం *మెగా రక్త దాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన 500 మంది కార్యకర్తలునెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ ఇంచార్జ్ &ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు.హాజరు అయిన అనీల్ కుమార్ యాదవ్ నెల్లూరు రాంజీ నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రియతమ నేత, మాజీముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు నగర నియోజకవర్గ నలుమూలల నుంచి 2 వేల కు మందికి పైగా నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరై బాణసంచా ద్వనులతో జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ హాజరై పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,అభిమానులు కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు, విద్యార్థులు, యువత, 500 మందికి పైగా యువత రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువతను ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు చూపిస్తున్న అభిమానం చెరగనిదని పేర్కొన్నారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే మళ్లీ అధికారమని తిరిగి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.ఈ సందర్భంగా నగర నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జననేత, ప్రియతమ నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించుకోవడం ఎంతోసంతోషకరమన్నారు.ఈ రోజు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,పార్టీశ్రేణులు,అభిమానులు,కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జగన్మోహన్ రెడ్డి కి ప్రజలపై ఉన్న అభిమానం తరగనిదని నిరూపించారని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలన పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చంద్రబాబు నాయుడు ఆశలన్నీ వమ్ము చేసి ప్రజలను నిలువునా దగా చేశాడని పేర్కొన్నారు.ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా పరుగులు తీసేదని.. ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.ప్రజల్లో కూడా మార్పు వస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకునేందుకు.సమాయత్తమవుతున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సన్నపురెడ్డి పెంచల రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్, మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు, హంజా హుస్సేని, వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున, విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి, వాణిజ్య విభాగం అధ్యక్షులు మంచి కంటి శ్రీనివాసులు, మాజీ ఏఎంసీ చైర్మన్ పెర్నెటి కోటేశ్వర్ రెడ్డి, డివిజన్ నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.