

మన న్యూస్:గొల్లప్రోలు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు,రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సందర్బంగా పిఠాపురం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ మండల/పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సేవా కార్యక్రమములు చేయడం జరిగినది
గొల్లప్రోలు పట్టణం వైయస్సార్ విగ్రహం నందు పిఠాపురం వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ వంగా గీతా విశ్వనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని వైయస్సార్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి సేవా కార్యక్రమం చేయడం జరిగినది.
పిఠాపురం ఇంచార్జ్ శ్రీమతి వంగా గీతానాథ్ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణం నందు పిఠాపురం నియోజకవర్గ వైస్సార్సీపీ ఆఫీసు నందు వైఎస్ఆర్సిపి క్యాడర్ నాయకులు అభిమానులు మధ్య కేక్ కట్ చేసి జగనన్న పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నారు.
పిఠాపురం లో ఉన్న సౌజన్య దివ్యాంగుల ట్రస్ట్ఆ శ్రమం లో ఉన్న దివ్యాoగులకి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది అనంతరం వారందరికీ భోజనాలు కార్యక్రమం నిర్వహించారు… ఈ కార్యక్రమం లో పిఠాపురం నియోజకవర్గ వైస్సార్సీపీ నాయకులు, మండల నాయకులు, వార్డు కౌన్సిలర్లు, సోషల్ మీడియా వారు,స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.