మన ధ్యాస ,నిజాంసాగర్,
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మొహమ్మద్‌నగర్ మండలంలోని సింగీతం రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు చేరింది. దీంతో బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి మంగళవారం రిజర్వాయర్‌ను సందర్శించి వరద పరిస్థితిని పరిశీలించారు. నీటిపారుదల శాఖ అధికారులను అడిగి నీటి మట్టం, ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వివరాలను తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అంతకుముందు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రమేష్ యాదవ్ నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి రిజర్వాయర్‌ను పరిశీలించి వరద పరిస్థితిని సమీక్షించారు.అనంతరం తుంకిపల్లి గ్రామ శివారులోని తుర్క చెరువు అలుగు రోడ్డుపై వరద నీరు ప్రవహించడంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆర్డీవో దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఆర్డీవో సంబంధిత అధికారులతో కలిసి తుర్క చెరువు వద్ద పరిస్థితిని పరిశీలించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తుంకిపల్లి గ్రామ సర్పంచ్ కుమ్మరి రాములు,కాంగ్రెస్ నాయకులు ఆకాష్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
