తిరుపతి, జూలై 30: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను వైసీపీ శ్రేణులు గురువారం ఘనంగా నిర్వహించారు . నగరంలోని పలు ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేశారు. నాయకులు కార్యకర్తలు అభిమానులు యువత పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భూమన అభినయ్ రెడ్డి యువ నాయకత్వంతో తిరుపతి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఆయనకు ప్రజల ఆదరణ రోజురోజుకు పెరుగుతోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.జన్మదిన వేడుకల్లో తిరుపతి నియోజకవర్గ వైసీపీ అధ్యక్షులు మల్లం రవిచంద్ర రెడ్డి, ఉదయ్ వంశీ, దినేష్ రాయల్, స్వరూప్, మల్లం రవికుమార్ రెడ్డి, డేరంగుల బాలాజీ, పసుపులేటి సురేష్, అనిల్ రెడ్డి, ప్రకాష్ బచ్చు, కుమార్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన అభినయ్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.