తిరుపతి:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ భూమన అభినయ్ గారిని వారి జన్మదిన సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ వంశీ గారు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి నగర అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రోడ్ల చిత్రపటాన్ని అభినయ్ గారికి జన్మదిన కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా అభినయ్ గారు ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు చేరుకుని, ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ ఉదయ వంశీ గారు శుభాకాంక్షలు తెలియజేశారు.