చిత్తూరు, మన ధ్యాస ,జూలై 29

రిపోర్టర్ కమల్ రెడ్డి

పూతలపట్టు నియోజకవర్గం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కెప్టెన్ గా తవణంపల్లి మండలం స్వస్తిక్ నగర్ కు చెందిన టి రాజేష్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర పరిపాలన కార్యదర్శి డి సతీష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం రాజేష్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయకుమార్ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను అందుకున్నారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ …. పూతలపట్టు నియోజకవర్గంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఇకపై నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల్లో తరచూ సమావేశాలను ఏర్పాటు చేసి, ఆయా మండలాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. అలా పరిష్కారం కాని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేసి పరిష్కరిస్తామన్నారు. ప్రజా సమస్యలే జయం ఇంకా ముందుకు సాగుతున్న ప్రిపరేషన్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున యువత, మహిళలు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు, కర్షకులు, ఆసక్తి కలిగిన ఇతరులు సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా పూతలపట్టు నియోజకవర్గ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కెప్టెన్ గా ఎంపికైన రాజేష్ ను నియోజకవర్గ పరిధిలోని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బుధవారం అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *