• పాల్గొన్న టాక్ ఆఫ్ ది టౌన్ -మునిరామ్ రెడ్డి కూటమి పార్టీ నాయకులు,డాలర్స్ గ్రూప్ సభ్యులు,అభిమానులు
  • తిరుచానూరులో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పుష్ప మునిరామ్ రెడ్డి దంపతులు

తిరుపతి, జూలై 28: తుడా చైర్మన్, టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యులు,టీడీపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా:డాలర్స్ దివాకర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం తిరుపతి టౌన్ క్లబ్ సమీపంలోని ఎన్‌టీఆర్ సర్కిల్ వద్ద అంగరంగ వైభవంగా అభిమానులు నిర్వహించారు.ఈ వేడుకల్లో వారికి అత్యంత సన్నిహితుడైన టాక్ ఆఫ్ ది టౌన్ అధినేత, సీనియర్ జర్నలిస్టు మునిరామ్ రెడ్డి ,మరియు వారి శ్రీమతి విజయ గణపతి ఆలయ ధర్మకర్త,టాక్ ఆఫ్ ది టౌన్ పత్రిక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పుష్ప రెడ్డి పేర్లు తో ..తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి తిరుచానూరు నలుమూలల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం తిరుపతిలో జన్మదిన వేడుకలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కూటమి పార్టీ నాయకులు, మహిళలు, అభిమానులు, డాలర్స్ యువసేన సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ,ముందుగా ఎన్‌టీఆర్ విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్ చేసి డా. డాలర్స్ దివాకర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తరువాత డాలర్స్ దివాకర్ రెడ్డి భారీ కటౌట్‌కు పాలాభిషేకం నిర్వహించారు.
అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా, డా. డాలర్స్ దివాకర్ రెడ్డి మిత్రులు, కూటమి పార్టీ నాయకులు, మహిళలు, స్థానికులు, అభిమానులు, డాలర్స్ యువసేన సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అనంతరం ఏం.ఆర్ పల్లి,రేణిగుంట వద్ద కూడా పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *