మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జూలై 7: ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్–2026) కార్యక్రమాన్ని నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించి, ఇంటింటి సర్వేను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ విక్టర్ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఆయన మొహమ్మద్‌నగర్, నిజాంసాగర్ మండలాల్లోని హసన్‌పల్లి,నర్వ ,సుల్తాన్‌నగర్,బంజేపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మొదట హసన్‌పల్లి గ్రామంలోని సందర్శించిన అదనపు కలెక్టర్ విక్టర్, తహసీల్దార్ లతా,కలిసి బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు), నిర్వహిస్తున్న ఇంటింటి ఎన్యుమరేషన్, ఓటరు వివరాల ధృవీకరణ, దరఖాస్తుల స్వీకరణ, డిజిటైజేషన్ ప్రక్రియను పరిశీలించారు, గ్రామంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ పనులను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.ఇంటింటి సర్వే, ఫారాల స్వీకరణ, ఓటరు వివరాల నమోదు, డిజిటైజేషన్ పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ..ప్రతి అర్హుడైన ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా బీఎల్‌వోలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా సర్వే పూర్తి చేయాలని, నిర్ణీత గడువులో అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మొహమ్మద్‌నగర్ తహసీల్దార్ లతా, ఆర్‌ఐ రెవెన్యూ అధికారి మచ్చేందర్ జిపివో వినోద్, హసన్‌పల్లి సర్పంచ్ బోయిని హరిన్ కుమార్, ఉప్పు సర్పంచ్ గంగారాం,తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *