నూతన వధూవరులను ఆశీర్వదించిన బొల్లినేని కార్తీక్..

కలిగిరి జూలై 6 మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె.

కలిగిరి పట్టణంలో సోమవారం రాత్రి నిర్వహించిన చి॥ల॥సౌ లక్ష్మీ స్రవంతి చి॥శశి వర్ధన్ రెడ్డి వివాహ రిసెప్షన్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగింది. కలిగిరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పేరం నాగిరెడ్డి , రమాదేవి దంపతుల కుమార్తె లక్ష్మీ స్రవంతి వివాహ రిసెప్షన్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు తనయుడు టిడిపి యువ నేత బొల్లినేని కార్తీక్ ముఖ్య అతిథిగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.వారి దాంపత్య,జీవితం,ఆనందమయం,ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో పిల్లా పాప ల తో కలకాలం కొనసాగాలని ఆయన ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఎస్సీ సెల్ ఉదయగిరి నియోజకవర్గ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య, ఊస మాల్యాద్రి, పలువురు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *