​రెండేళ్ల విశిష్ట సేవలను కొనియాడిన జేసీ గోవిందరావు, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు.

తిరుపతి, జూలై 4:

తిరుపతి జిల్లా కలెక్టర్‌గా రెండేళ్ల పాటు అత్యుత్తమ సేవలు అందించి గాను డాక్టర్ వి.ఎస్. వెంకటేశ్వర్‌ను శనివారం జిల్లా కలెక్టరేట్ చాంబర్‌లో అధికారులు, సిబ్బంది అత్యంత ఘనంగా సత్కరించారు. జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు ఆధ్వర్యంలో కలెక్టరేట్ సిబ్బంది, రెవెన్యూ అసోసియేషన్ల ప్రతినిధులు ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ అభినందనలు తెలియజేశారు.

జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు మాట్లాడుతూ.. కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా ప్రగతికి, ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కారానికి అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. రెండేళ్ల పాటు ఆయన అందించిన సేవలు ఎంతో చిరస్మరణీయమైనవని, క్లిష్ట సమయాల్లోనూ ఆయన చూపిన నాయకత్వ పటిమ, మార్గదర్శకత్వం తమకు ఎంతో నేర్పించాయని పేర్కొన్నారు.

​”పాలనలో తనదైన ముద్ర వేస్తూ, ఉద్యోగులందరినీ ఒక కుటుంబంలా సమన్వయం చేసుకుంటూ తిరుపతి జిల్లాను ప్రగతి పథంలో నడిపించడంలో కలెక్టర్ కీలక పాత్ర పోషించారు.”

రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు

​అనంతరం డాక్టర్ వి.ఎస్. వెంకటేశ్వర్‌ను శాలువాతో సత్కరించి, సిబ్బంది తరఫున ఘనంగా జ్ఞాపికను బహూకరించారు. ఆయన తన భావి బాధ్యతల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆకాంక్షించారు.

​.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *