చంద్రబాబు విజన్‌తోనే ఆంధ్రప్రదేశ్ ప్రగతి.. కూటమి కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా తెలుగుదేశం పార్టీ: తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి. గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తో పాటు తిరుపతి పార్లమెంట్ కో ఆర్డినేటర్ దామచర్ల సత్య,తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి , గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పాల్గొన్నారు.నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, స్థానిక సమస్యలు, పార్టీ బలోపేతం మరియు భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు, నాయకులకు దిశా నిర్దేశం చేశారు.క్లిష్ట పరిస్థితుల్లో కూడా పార్టీ కోసం నిలబడి, అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్క కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.ప్రతి కార్యకర్త ప్రభుత్వ సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.గూడూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతోందని, స్థానిక పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతోందని తెలిపారు.గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి అందిస్తున్న సహకారం అమోఘం. చంద్రబాబు నాయుడు విజన్‌కు అనుగుణంగా, స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తో కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి తుడా చైర్మన్‌గా నా వంతు పూర్తి బాధ్యతను నిర్వర్తిస్తాను తెలిపారు.కార్యకర్తల కష్టాన్ని పార్టీ ఎన్నటికీ మరువదని,ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి ప్రభుత్వం తరఫున తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయి.తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని దివాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ సమీక్షా సమావేశంలో నియోజకవర్గ ముఖ్య నేతలు, నియోజకవర్గ పరిధిలోని మండలాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు క్రియాశీలక కార్యకర్తలు పాల్గొన్నారు.


