పేదలకు కష్టాల్లో తోడుగా ఉంటున్న కోడే వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్…. ట్రస్ట్ చైర్మెన్ వెంకటాద్రి నాయుడు కి సబ్యులు నవీన్ కి పలువురు ప్రశంసలు…..

కొండాపురం జూన్ 30 మన న్యూస్ ప్రతినిధీ నాగరాజు..

ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో బోడ కొండయ్య ఇటీవల అనారోగ్యానికి గురై బాధ పడుతున్న తరుణం లో ఈ విషయం తెలుసుకొన్న కోడె వెంకట్రావు చారిట్రబుల్ ట్రస్ట్ చైర్మెన్ చెరుకూరి వెంకటాద్రి నాయుడు , మరియు ట్రస్ట్ సభ్యులు చెరుకూరి నవీన్,వారి కుమారుడు బోడ బ్రహ్మయ్యను ట్రస్ట్ కార్యాలయం కి పిలిపించి ఆర్థిక సాయం అందించరు.అనంతరం ట్రస్ట్ చైర్మెన్ వెంకటాద్రి నాయుడు మాట్లాడుతూ ట్రస్టు కార్యాలయం నిత్యం పేద ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. పేదలకు ఎలాంటి సహాయం కావలన్న, పేదల ఇబ్బంది పడుతున్న , అనారోగ్యాల తో బాధపడుతున్న, నేరుగా తమ ట్రస్ట్ కార్యాలయానికి వస్తే ఆర్ధిక సాయాన్ని అందిస్తామని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చెరుకూరి వెంకపా నాయుడు , అంబటి శ్రీను, మెడికల్ మధు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *