మన ధ్యాస, నెల్లూరు, జూన్ 27 : నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో శనివారం నెల్లూరు నగరానికి చెందిన కల్లూరి లక్ష్మీ రెడ్డి విలేఖరుల సమావేశం జరిగింది. ఈ సమావేశం లో కల్లూరి లక్ష్మీ రెడ్డి ఆవేదన తో మాట్లాడుతూ….నా పేరు కల్లూరి లక్ష్మీ రెడ్డి, సదరు వ్యక్తి అనగా (గంగినేని శ్రీహరినాయుడు తండ్రి చెంచయ్య నాయుడు) నాపైన చేసిన ఆరోపణలు అన్ని కేవలం అవాస్తవాలు కల్పితాలు మాత్రమే . వాస్తవానికి సదరు వ్యక్తి యొక్క ఇంట్లో ఆఫీసు నిమిత్తం అద్దెకు చేరడం జరిగింది ఈనేపథ్యం లో సదరు వ్యక్తి మరియు అతని కుటుంబము నాతో నమ్మకంగా నడుచుకుంటూ అతను ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ అని, అతని కుమార్తె ప్రభుత్వ స్కూల్ లో టీచరు గా పనిచేస్తుంది అని మరియు అతని కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ మీద నమ్మకం వచ్చేవిధంగా నడుచుకుంటూ, కొద్ది రోజుల తర్వాత అతని కుమారుడికి ఏదో ఇల్లు కొంటున్నాడని డబ్బులు అవసరం ఉంది అని అత్తని ఫోన్ ద్వారా అతని కొడుకుతో కూడా ఫోన్ లో మాట్లాడించి, నన్ను నమ్మించి సదరు వ్యక్తి, అతని భార్య, అతని కుమార్తె మరియు అతని అల్లుడు బండారు శ్రీనివాసులు త్వరలో తిరిగి ఇస్తామని నన్ను నమ్మించి చెప్పడం ఇచ్చిన మొత్తం వడ్డీతో సహా నీకు తో ఇతరుల దగ్గర అప్పుగా తెచ్చి మరికొంత డబ్బును వారికి ఇవ్వడం జరిగింది, అందుకు గాను సదరు వ్యక్తి నాకు ప్రామసరి నోట్ లు కూడా ఇచ్చినాడు. కాగా నేను ఇచ్చిన డబ్బుకు సదరు వ్యక్తులు చెప్పిన గడువు పూర్తి కావడం తో మరియు నేను అప్పుగా తెచ్చిన వాళ్ళు కూడా నన్ను అడుగుతూ ఉండటం తో, సదరు వ్యక్తులని నేను పలుమార్లు అడిగినా కూడా సరియగు సమాధానం రాలేదు. కాగా నాదగ్గరున్న ఆధారాలతో లాయర్ గని ఆశ్రయించి విషయం వివరించడం తో నాకు రావలసిన డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుతూ వారి 5మదికి 28 ఏప్రిల్ 2026 రోజున లీగల్ నోటీస్ ను పంపడం జరిగింది. నేను లీగల్ నోటీసు పంపిన తర్వాత వారికి ఉన్న పలుకుబడిని ఉపయోగించుకొని, నేను ఏమి చేయలేని దాన్ని అని నాకు రావలసిన డబ్బులు ఎగవేయ తలచి నన్ను బెదిరించడం తో పాటు ఏవేవో సృష్టించి నా మీద అక్రమంగా కేసు లు కూడా పెట్టి నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసారు. అంతేకాకుండా సదరు వ్యక్తి యొక్క అల్లుడు తను లాయర్ అని అతను తల్చుకుంటే నన్ను ఏమైనా చేయగలనని నన్ను ఏవేవో కేసు లు పెట్టి జైలుకి పంపగలనని నేను ఇచ్చిన డబ్బును అడగకుండా ఉండే విధంగా నన్ను భయపెట్టి చేయడమే కాకుండా, 25 జూన్ 2026 నాడు ప్రెస్ మీట్ పెట్టి నా పైన అక్రమమైనటువంటి మరియు అన్యాయం అయినటువంటి నిరాధారమైన ఆరోపణలు చేసి నన్ను మానసికంగా క్షోభ కి గురిచేయ్యడమే కాకుండా నా పరువు తీసే విధంగా ఆ సదరు వ్యక్తి వ్యాఖ్యలు చేస్తూ అసలు సంబంధమే లేని వ్యక్తుల పేర్లను కూడా ప్రస్తావించడం జరిగింది. సదరు వ్యక్తులు అందరి పైన చట్టపరమైన చర్యలు తీసుకొనుటకు నేను వెనకాడనని, వీరి మీద పరువు నష్టం దావా కూడా వేస్తాను అని తెలుపుకుంటున్నాను, కాని వీరి బెదిరింపులు వీరి ప్రవర్తనతో వీరి నుంచి నాకు ప్రాణ హాని ఉంది అని కూడా మీకు తెలుపుకుంటున్నాను, సదరు వ్యక్తులు నుంచి నాకు ప్రాణ హాని ఉన్నది కావున మీడియా సమక్షంలో నాకు రక్షణ కల్పించి నాకు న్యాయం జరిగేలా చూడమని అధికారులను కోరుకుంటున్నాను తెలియ జేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *