అనారోగ్యంతో బాధపడుతున్న టిడిపి నాయకులకు కార్యకర్తలకు ధైర్యం చెప్పి పరామర్శించిన టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు ఆయన తనయుడు కార్తీక్..

బొల్లినేని వెంకట రామారావు కు పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆత్మీయ పలకరింపులు….

కలిగిరి జూన్ 27, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

కలిగిరి పట్టణంలో అనారోగ్యంతో ఉన్న పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల నివాసాలకు వెళ్లి టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు , వారి తనయుడు టిడిపి యువనేత బొల్లినేని కార్తీక్ పరామర్శించారు.ఈ సందర్భంగా మండల తెలుగు యువత మాజీ అధ్యక్షులు నిస్సంకర సురేష్ తండ్రి రామయ్య గారిని, ఆవుల శ్రీరాములు సతీమణి సుజాత ని, టిడిపి పట్టణ బూత్ ఇంచార్జ్ హోటల్ భాష ని, టిడిపి కార్యకర్త పుల్ల మంజన్ ని వారి నివాసాలకు వెళ్లి కలుసుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం బాధితులతో కొద్దిసేపు మాట్లాడి ధైర్యం చెప్పిన బొల్లినేని వెంకట రామారావు , కార్తీక్ వారు త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు బారి ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *