కలిగిరి, గురువారం ,జూన్ 25, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
కలిగిరి మండలం, పొలంపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన దువ్వూరి బాలయ్య – రమణమ్మ దంపతుల కుమారుడు చిll ఏడుకొండలు-చిllలllసౌ కవితల వివాహ మహోత్సవం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ ప్రజల సమక్షంలో అంగరంగ వైభవంగా, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ నూతన వధూవరులకు ఆశీర్వదిస్తూ కాకర్ల చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ.10 వేల రూపాయలను పెళ్లికానుకగా మండల, స్థానిక నాయకుల ద్వారా వధూవరులకు అందజేయించి, వారి కొత్త జీవితానికి శుభారంభం కలగాలని ఆకాంక్షించారు.ఈ వివాహ వేడుకలో కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పూసాల వెంగప నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు చీమల తాతయ్య, ప్రధాన కార్యదర్శి కొప్పోలు కొండలరావు, మాజీ ప్రధాన కార్యదర్శి కాకు మహేష్, ఏపినాపి సర్పంచ్ పాములూరి వరప్రసాద్, కలిగిరి మండల టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్రా నాగరాజు, పొలంపాడు గ్రామ టీడీపీ ఉపాధ్యక్షులు ఉన్నిమద్దెల తిరుపాలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు మరియు గ్రామస్థులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
