కోడే వెంకరావు చారి ట్రబుల్ ట్రస్ట్ పేద ప్రజలు ku అన్ని విధాలుగా అందుబాటులో ఉంటుంది అంటున్న కోడే వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్.. సభ్యులు చెరుకూరి నవీన్..

కొండపురం, జూన్ 20, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం కొమ్మి హరిజనవాడలో పొంతగాని వెంకటేశ్వర్లు ఇటీవల అనారోగ్యానికి గురవడంతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆర్థిక సాయం అందించిన కోడే వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు చెరుకూరి నవీన్. అంతే కాకుండా పేద వారికి నిత్యం ఎల్లప్పుడూ ట్రస్ట్ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. అదేవిధంగా పేదలకు ఎలాంటి సమస్య ఉన్న మన కోడె వెంకట్రావు చారిటబుల్ ట్రస్టు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఎవరికీ ఎలాంటి సహాయం కావాలన్నా మమ్మల్ని కలవచ్చని ఆయన తెలియజేశారు.అదే విధంగా ఈ కార్యక్రమంలో కొమ్మి గ్రామ కమిటీ అధ్యక్షులు దేవినేని వెంకటసుబ్బయ్య, నాయకులు చెరుకూరు శేషయ్య, చెరుకూరి వెంకయ్య, అంబటి సుబ్బారావు, ఉంటా హజరత్, శ్రీను , మాజీ సర్పంచులు చెన్నయ్య, యోన , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *