హైదరాబాద్, శంకర్పల్లి, జూన్ 20 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

దుత్తలూరు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మల్లంపాటి గురవయ్య నాయుడు, శ్రీమతి రాజేశ్వరి దంపతుల కుమారుడు చిll వెంగల్, చిllలllసౌ మధులికల వివాహ మహోత్సవం శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని శంకర్పల్లిలోని కే కన్వెన్షన్లో వైభవంగా జరిగింది.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మరియు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉదయగిరి మాజీ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వివాహ వేడుక ఆత్మీయ వాతావరణంలో ఘనంగా జరిగింది.
