దుత్తలూరు జూన్ 18 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

దుత్తలూరు మండలం నందిపాడు క్లస్టర్ పరిధిలోని బోటికర్లపాడు ప్రాథమిక పాఠశాల నందు టిడిపి మండల అధ్యక్షులు ఉండేలా గురువారెడ్డి విద్యార్ధిని విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడే నోటి పుస్తకాలు, పలకలు, పెన్నులు ,పెన్సిల్లు బలపాలు మరియు అదనపు విధ్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు ఎంఈఓ.ఫాజుల్ అలీ,ఎంఈఓ II ఎన్ వెంగయ్య దుత్తలూరు టీడీపీ మండల కన్వీనర్ ఉండేల గురువారెడ్డి మరియు క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు టి దేవకుమార్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జే.విజయ సహ ఉపాధ్యాయులు మల్లికార్జున పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కె.రవి మరియు గ్రామస్తులు ఆది రెడ్డి, సుబ్బారెడ్డి సుబ్బారావు ,తిరుపతయ్య, బాబు మరియు పిల్లల తల్లిదండ్రులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అభ్యసన సామాగ్రి పంపిణీఅనంతరం పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న దాత దుత్తలూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉండేలా గురవా రెడ్డి ని వారి తండ్రి మాజీ సర్పంచ అయిన ఉండేల గురవా రెడ్డి ను మండల విద్యాశాఖ అధికారులు,ఉపాధ్యాయులు మరియు గ్రామ పెద్దలుసన్మానించడం జరిగింది. తదనంతరం ఎమ్ ఈ ఓ ఫాజల్ అలీ, ఎమ్ ఈ ఓ యన్ వెంగయ్య ను ఉండేల గురవా రెడ్డి సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సి ఆర్ ఎం టి ఎస్ అంగన్వాడీ కార్యకర్తలు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
