పగడ్బందీగా ఎస్ ఐ ఆర్ అమలు..
కలిగిరి జూన్ 17 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
బుధవారం మన ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యుల కాకర్ల సురేస్ సూచనల మేరకు కలిగిరి గ్రామపంచాయతీ కలిగిరి పట్టణం నందు 249 బూత్ పరిధిలో ఓటర్ వెరిఫికేషన్ లో భాగంగా sir ప్రోగ్రాం లో భాగంగా ప్రతి ఓటర్ ఇంటి ఇంటి కి వెళ్లి ఓటరు గణన పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణారెడ్డి మరియు కలిగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షులు చల్లా వెంకీ మరియు సచివాలయం అధికారి బి ఎల్ ఓ అశ్విని పాల్గొనడం జరిగింది . అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బిజ్జం వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క ఓటరు, ఓటరు గణన పత్రాన్ని అందుకొని ఓటర్ వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలియపరిచారు.అదే విధంగా డబుల్ ఎంట్రీలు ,డెత్ లు , శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లి అక్కడే నివసిస్తున్నటువంటి ఓటర్లను గుర్తించి అటువంటి ఓట్లను రెండు చోట్ల ఉన్నట్లయితే ఒక చోట తొలగించి ఒక చోట మాత్రమే ఉంచాలని ఆయన చూచించారు.అదే విధంగా ప్రతి ఒక్క ఓటరు ఓటర్ ఐడి కి ఆధార్ లింక్ చేయించుకోవాలని ఆయన తెలియపరిచారు.