హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు..

కలిగిరి జూన్ 10 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

కలిగిరి లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలమేరకుఉదయగిరి శాసనసభ్యులు,యువ నాయకులు కాకర్ల సురేష్ సూచనల తో కలిగిరి మండల కేంద్రంలోనీ మాలతీ స్కూల్ ప్రాంగణం నందు కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పూసాల వెంగప నాయుడు ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో మండలంలోని 23 పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళిక, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్ వెరిఫికేషన్ గురించి చర్చించడం జరిగినది. తదుపరి హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు బాలయ్య బాబు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సమావేశాన్ని విజయవంతంగా ముగించడం జరిగినది.ఈ కార్యక్రమంలో కలిగిరి జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, టిడిపి రాష్ట్ర తెలుగు రైతు కార్య నిర్వాహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు,మండల టిడిపి పార్టీ అధ్యక్షులు పూసాల వెంగప నాయుడు, ప్రధాన కార్యదర్శి కొప్పోలు కొండలరావు, చేరెడ్డి సుబ్బారెడ్డి, మరియు క్లస్టర్, బూత్, ఇన్చార్జిలు 23 గ్రామ పంచాయతీల గ్రామ కమిటీ అధ్యక్షులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *