శ్రీకాళహస్తి జూన్ 9.అత్తారింటి గౌరవ మర్యాదలకు ఎక్కడా భంగం కలగకుండా చూసుకోవడమే కాక, అభాగ్యులకు అవసరమైన సేవలు అందిస్తూ శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల గుండెల్లో గౌరవప్రథమైన స్థానం పొందిన ఎమ్మెల్యే “బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి” అర్ధాంగి “బొజ్జల రిషితా రెడ్డి” సామాన్యుల ఆత్మబంధువు అని తెలుగుదేశం పార్టీ, శ్రీకాళహస్తి పట్టణ ప్రధాన కార్యదర్శి “కాసరం రమేష్” కొనియాడారు.

“బొజ్జల రిషితా రెడ్డి” జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు స్ధానిక కుమారస్వామి తిప్ప వద్ద ఉన్న రిపబ్లిక్ క్లబ్ కూడలిలో “కాసరం రమేష్” ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో “బొజ్జల బృందమ్మ” కి వేదపండితులు ఆశీర్వాదములు ఇచ్చి, అనంతరం చిన్న పిల్లల చేతుల మీదుగా కేక్ కట్ చేసి పంచి పెట్టడం జరిగింది.

స్వర్గీయ “బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రెడ్డి” రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు “బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి” గత ఎన్నికలలో సాధించిన విజయంలో కీలకపాత్ర పోషించడమే కాక, పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి కష్టనష్టాలకు తగిన పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న “రిషితా రెడ్డి” “బొజ్జల” కుటుంబ ఔన్నత్యాన్ని మరింతగా పెంచుతోందని కొనియాడారు.

పై కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు విజయకుమార్,మార్కెట్ కమిటీ చైర్మన్ చంచయ్య నాయుడు, రాష్ట్ర కార్యదర్శి సుబ్బయ్య,క్లస్టర్ ఇంచార్జ్ కంటా రమేష్, వన్నెకుల క్షత్రియ సభ్యులు మిన్నల్ రవి,టీడీపీ బి సీ విభాగం రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఉమేష్ రావు మోరే, ధర్మకర్తల మండలి సభ్యులు వాకచర్ల గుర్రప్పశెట్టి,తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి వజ్రం కిషోర్,టౌన్ బ్యాంకు చెర్మెన్ ఖాదర్ బాష, చేర్మన్ బీమాల భాస్కర్,టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ డీ,టౌన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ బాలు ఢిల్లీబాబు,సోషల్ మీడియా కన్వీనర్ కోటా చంద్ర,ఆర్రా టి సీ మచంద్రయ్య,నెమల్లూరు బుజ్జి,పట్టణ అధ్యక్షురాలు సుమతి, సీనియర్ నాయకురాలు రేణుకమ్మ,చంద్రమ్మ,మునిరాజ యాదవ్,అస్మత్,రామకృష్ణ యాదవ్,వంకాయల సిద్దులయ్య,ఆర్ముగం,గంగలపూడి హరి, మణి, రాకేష్, ఎంపీ శ్రీను, కోలా సుబ్రహ్మణ్యం, నవీన్, బాబు నాయుడు,కొండ సతీష్,కాసరం శ్రీను, క్లబ్ గాంధి, లక్ష్మీనారాయణ గుప్త, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *